NRML: నిర్మల్ మండలంలోని అనంతపేట్ గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను శనివారం డీఈవో రామారావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు సమ్మెలో ఉన్నందున విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. విద్యార్థుల చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు.