KNR: జమ్మికుంట పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్లో గురువారం ఉదయం 9:30 గంటలకు త్రీ వీలర్, ఫోర్ వీలర్ డ్రైవర్లకు ఉచితంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సైదాపూర్ ఎస్సై కొప్పుల స్వాతి తెలిపారు. ఈ అవకాశాన్ని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి అద్దాలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.