మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 24 డివిజన్లో 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాధా గోవర్ధన్ గౌడ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.