VKB: బొంరాస్పేట మండల కేంద్రంలోని పశు వైద్యశాలకు వెళ్లేందుకు రైతులు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. రోడ్డుపై ఏర్పడిన గుంతల వల్ల వైద్యం కోసం వచ్చే రైతులు ప్రమాదకరంగా దాటుతున్నారు. వృథాగా నీరు పోవడంతో రోడ్డుపై నీరు నిల్వ ఉందని ప్రజలు ఆరోపించారు. ఏ మాత్రం అదుపు తప్పినా గుంతల్లో పడిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.