NLG: వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ అప్పుడే కసరత్తు ముమ్మరం చేసింది. ఉమ్మడి నల్గొండలో వ్యతిరేకత ఉన్న ఆరు నియోజకవర్గాల్లో సిట్టింగ్లను మార్చి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రజాదరణ కోల్పోయిన నేతలపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల మార్పు ద్వారానైనా మళ్లీ పట్టు సాధించాలని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.