KMR: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఇటీవల పాల్గొనని కుటుంబాల వివరాలు ఈ నెల 16 నుంచి 28 వరకు నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో నమోదు చేసుకొనని కుటుంబాల వివరాలు ఎంట్రీ చేసుకునే విధంగా ప్రభుత్వం మరొక అవకాశం కల్పించిందని తెలిపారు.