MLG: వెంకటాపూర్ (రామప్ప) మండలం వెళ్తుర్లపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయితీ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం సర్పంచ్ బొజ్జ శారద జగన్ మోహన్ రావు నిర్వహించగా, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. అనంతరం అధికారులు, సర్పంచ్, వార్డు మెంబర్లు పంచాయతీరాజ్ డైరెక్టర్ ని శాలువాతో సన్మానించారు.