MDCL: మేడ్చల్ జిల్లా పరిధి ఉప్పల్, బోడుప్పల్, నాచారం, చిలుకా నగర్, కీసర సహాపలు ప్రాంతాలలో రేషన్ బియ్యం పంపిణీ సంబంధించి లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కసారిగా లబ్ధిదారులు రావడంతో డీలర్లు టోకెన్ సిస్టం అమలు చేస్తున్నారు. ఉదయం టోకెన్లు అందజేసి, ఉదయం, సాయంత్రం రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. రోజుకు ఒక్కోచోట 200 మంది చొప్పున అందిస్తున్నారు.