మహబూబ్నగర్ జిల్లాలోని 11వ డివిజన్ పరిధిలోని బండమీదిపల్లి, వడ్డెర బస్తీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు బావిని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి (MSR) ప్రారంభించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రాధాన్యతని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ గిరి గౌడ్, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు.