SRD: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై మండల స్థాయి సమావేశం ఈనెల 16 నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సత్తయ్య మంగళవారం తెలిపారు. కంగ్టిలోని బసవ ప్రదీప్ ఫంక్షన్ హాల్లో మండల ప్రత్యేక అధికారి నూతన కుమార్ అధ్యక్షతనలో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు సకాలంలో రావాలని ఆయన కోరారు.