KMR: జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, మహిళా విద్యకు పునాదులు వేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకుని గాంధారి చౌరస్తాలో బీసీ సంఘం ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంఘం సభ్యులు మాట్లాడుతూ.. మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.