WGL: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తేనే డీలర్స్ను ఎక్కువగా నమ్ముతారని, రాష్ట్రాభివృద్ధిలో డీలర్స్ పాత్ర కీలకమని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్& సీడ్స్,డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. శివనగర్‌లో నేడు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని సన్మానించారు.