KMR: మద్నూర్ మండలంలో పాత విద్యుత్ స్తంభాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వాటి స్థానంలో ఎత్తైన సిమెంటు స్తంభాలను విద్యుత్ శాఖ ఏర్పాటు చేస్తోంది. ట్రాక్టర్ల ద్వారా స్తంభాలను తరలిస్తూ, అత్యాధునిక మిషన్లతో గుంతలు తీసి పనులు వేగవంతం చేశారు. అన్ని గ్రామాల్లో దశలవారీగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.