MLG: వెంకటాపురం మండల కేంద్రంలో తుడుందెబ్బ సంఘం నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మహబూబాబాద్ సమావేశానికి వెళ్తుండగా తాడ్వాయి పోలీసులు మార్గమధ్యంలో అరెస్టు చేయడం అన్యాయమని మండల అధ్యక్షుడు తుర్స చంటి దొర తెలిపారు. ఆదివాసి కోసం పోరాడుతున్న నేతలను అరెస్టు చేయడాన్ని ఖండించారు.