MDK: రామాయంపేట స్థానిక పీపీసీ కేంద్రాన్ని తహశీల్దార్ రజనీకుమారి సందర్శించారు. లారీల కొరతతో మక్కల నిల్వలు పేరుకుపోవడంతో, ప్రస్తుతానికి వడ్లు ఆరబోయవద్దని రైతులకు సూచించారు. మౌలిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని ఇంఛార్జ్‌లను ఆదేశించారు. రవాణా ఇబ్బందులు తొలగిన వెంటనే వడ్ల కొనుగోళ్లు ప్రారంభిస్తామని, అప్పటివరకు రైతులు సహకరించాలని ఆమె కోరారు.