KNR: వీణవంక మండలంలో 15 ట్రాక్టర్ల ఇసుక డంప్‌ను రాత్రి సీజ్ చేసినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. కొండపాక, పోతిరెడ్డిపల్లి, హిమ్మత్ నగర్ గ్రామాలలో చట్ట వ్యతిరేకంగా ఇసుకను అక్రమంగా నిల్వ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇసుక సీజ్ చేసి, డంపు చేసిన ఇసుక పంచనామా నిర్వహించి, తహశీల్దార్‌కు అప్పగించమన్నారు. అక్రమ ఇసుక దందా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.