JGL: జగిత్యాల పట్టణంలోని శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి దశమ వార్షికోత్సవ కళ్యాణానికి హాజరుకావాలని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం సభ్యులు కోరారు.