RR: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇవాళ డీఆర్ఐ (DRI) అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్ నుండి ఇండిగో విమానంలో వచ్చిన సలీం అనే ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతని బ్యాగులో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు నిషిద్ధ వస్తువులను సీజ్ చేసి, సలీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.