SRPT: హెచ్పీవీ టీకాతో మహిళల్లోని గర్భాశయ క్యాన్సర్కు పూర్తిగా చెక్ పెట్టవచ్చని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం జాజిరెడ్డిగూడెం పీహెచ్సీని సందర్శించి హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌమారదశ బాలికలకు టీకా అందించడం ద్వారా భవిష్యత్తులో వ్యాధి రాకుండా కట్టడి చేసే అవకాశం ఉందన్నారు.