MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. బుధవారం గ్రామంలో జరుగుతున్న సర్వే పనులను పర్యవేక్షించిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ అజీమ్ మాట్లాడుతూ.. భూ రికార్డులను శుద్ధి చేసి పారదర్శకత తీసుకురావడం కోసం ఈ రీ-సర్వే చేపట్టినట్లు తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించిన పత్రాలతో సహకరించాలని ఆయన సూచించారు.