MHBD: రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మంచి ధర పొందాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. జాటో రామచంద్రనాయక్ సూచించారు. దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.