WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 3369 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడంతో 474 పాఠశాలలు మూతపడ్డాయని అధికారులు తెలిపారు. WGL జిల్లాలో 135, జనగామ 70, హనుమకొండ 36, ములుగు 36, భూపాలపల్లి 30, మహబూబాబాద్ 167 పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూతపడ్డాయి. మూతపడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించే బాధ్యతను సర్పంచులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.