MDK: అంబాజీపేటలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ రెండో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మొక్కుకున్నట్లు తెలిపారు.