KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ 2 రోజుల సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభం కానుంది. నిన్న, నేడు సాధారణ సెలవులు కావడంతో మార్కెట్ మూసి ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను తీసుకుచ్చి సరసమైన ధరలు పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 9 గంటలలోపు మాత్రమే పత్తిని యార్డులోకి అధికారులు అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.