NRML: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లీగల్ సెల్ నాయకుడు మట్టేరి రాజశేఖర్, న్యాయవాది షేక్ ఖదీర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.