MBNR: రాజాపూర్ మండలం గుండ్ల పొట్లపల్లి గ్రామంలో సర్పంచ్ మాడమోని మాసయ్య ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేసవి ఎండల దృష్ట్యా బాటసారులు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక నేతలు, గ్రామస్తులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని అభినందించారు.