MDCL: ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వెళ్లే మార్గంలోని వరంగల్ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. గత 5 సంవత్సరాల్లో ఏకంగా 24 మందిని బలికొంది. ఉప్పల్, మేడిపల్లి, పోచారం, ఘట్కేసర్ ఏరియాల్లో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఉప్పల్ నుంచి నారపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు ఇరుకుగా, ప్రమాదకరంగా ఉండటం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, అధిక వేగమే ఈ ప్రమాదాలుకు కారణాలుగా తెలుస్తోంది.