SRD: పట్టణం సిక్కువాడలోని గురునానక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం రాత్రి 51 రకాల నైవేద్యాలను ప్రసాదంగా సమర్పించారు. అనంతరం గణపతికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీశైలం గౌడ్, మణిందర్ సింగ్, ప్రమోద్, శ్రీకాంత్, నవీన్ పాల్గొన్నారు.