సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సీఎస్ఆర్ కింద చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. పాఠశాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.