MBNR: విద్య నాణ్యతను పెంచినప్పుడే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్వాడ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బోధనాభ్యాస సామాగ్రి మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వినూత్న పద్ధతిలో బోధించడం ద్వారా విద్యార్థులకు చక్కగా అర్థమవుతుందన్నారు.