PDPL: ధర్మారం మండల కేంద్రంలోని గణేష్ నగర్లో నెలకొల్పిన మహాగణపతి లడ్డూను చింతపండు సాయి చరణ్, ప్రమోదిని దంపతులు వేలం ద్వారా రూ.75 వేలకు దక్కించుకున్నారు. లంబోదరుడి మహాప్రసాదాన్ని సాయి చరణ్ వరుసగా తొమ్మిదోసారి దక్కించుకోవడం విశేషం. ఇందుకు ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాన కలశాన్ని రూ.25 వేలకు సిగిరి లచ్చయ్య దక్కించుకున్నారు.