MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు హైదరాబాద్ నుంచి జడ్చర్ల వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో వెనుకున్న వాహనం ముందు భాగం దెబ్బతిని ఆ వాహనంలో ఉన్న మహిళ ముఖానికి గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.