ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని వార్డులలో వీధి కుక్కలు సమాచారాన్ని సంబంధిత సచివాలయాల శానిటేషన్ సెక్రటరీకి ప్రజలు తెలియజేయాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి కోరారు. ఇందులో భాగంగా కుక్కల పట్టివేత కొనసాగింపు శనివారం కొనసాగింది. ఇప్పటి వరకు 300 కుక్కలదాకా పట్టుకుని గిద్దలూరు అటవీ ప్రాంతంలో వదిలివేశామన్నారు.