SRCL: జిల్లాలోని సఖి కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ప్రొఫెషనల్ డిగ్రీ లేదా లా డిగ్రీ చేసి ఉండాలని, అలాగే కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 వేతనం లభిస్తుందని తెలిపారు.