GDWL: ధరూర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో హౌసింగ్ ఏఈ ప్రమోద్ కీలక సూచనలు చేశారు. మొదటి విడతలో మంజూరైన గృహ నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. వాటి పూర్తి తర్వాతే రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉంటుందని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న గృహాలను పూర్తిచేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.