WNP: జిల్లాలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు కలెక్టర్ ఆదర్శ్ సురభి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 14న అన్ని మండల కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, 16న మండల స్థాయి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించి, చలానాలు విధించాలని అధికారులను ఆదేశించారు.