JGL: సారంగాపూర్ మండలంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంబట్ల-కోనాపూర్ శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి ఆలయం ఆదివారం మూసివేయనున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీ.అనూష తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేసి, తిరిగి సోమవారం వేకువజామున సంప్రోక్షణాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత భక్తుల దర్శన సౌకర్యం కల్పిస్తారు.