HYD: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ చేదువార్త తెలిపింది. సికింద్రాబాద్-నాగపూర్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 కోచ్‌లతో నడుస్తుండగా ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 8 కోచ్‌లకు కుదిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్ ప్రారంభించినప్పటి నుంచి సగం సీట్లు కూడా నిండకపోవడమే కారణం అన్నారు.