NLG: చండూరు మండల కేంద్రానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన LOC పత్రాలను ఎమ్మెల్సీ సత్యం అందజేశారు. చండూరు మండలానికి చెందిన దోటి శ్రీను, కప్పెర ముత్యాలు, కళ్లెం తిరుపతిలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఈ సాయం అందింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన అన్నారు.