MDCL: ఉప్పల్-చిలుకానగర్ ప్రధాన మార్గంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్ ఆలస్యంగా ప్రారంభమవుతుండటంతో ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. పనులకు వెళ్లే కార్మికులు ఉదయాన్నే చేరుకున్నప్పటికీ క్యాంటీన్ తెరవకపోవడంతో ఖాళీ కడుపుతోనే తిరిగి వెళ్లాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. సమయానికి సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.