నల్లగొండ జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం 319 కేంద్రాల్లో కొనుగోళ్లు నిరంతరాయంగా జరుగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి వరకు మొత్తం 7,01,249 మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా శుక్రవారం ఒక్కరోజే 17,014 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.