ADB: నార్నూర్‌లో ప్రభుత్వ భూమిని అక్రమంగా తవ్వి మట్టిని తరలిస్తున్న ఉదంతం కలకలం రేపింది. ఓ పెట్రోల్ బంక్ నిర్మాణానికి అవసరమైన మట్టిని అధికారులు అనుమతి లేకుండానే కాంట్రాక్టర్ రాత్రుళ్లు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా ఆస్తిని దోచుకుంటూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.