WNP: అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల భద్రత కూడా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యతని, అందులో భాగంగానే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పేర్కొన్నారు. గురువారం గోపాలపేట మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.