BDK: బైక్పై అక్రమంగా తరలిస్తున్న కిలో ఎండు గంజాయిని మంగళవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎస్సై శ్రీహరిరావు వివరాల ప్రకారం.. భద్రాచలం ఆర్టీఏ కార్యాలయం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒడిశా నుంచి HYDకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి నుంచి బైకును, గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.