MDCL: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు 9063421300 ఈ నంబర్ తప్పనిసరిగా ఫీడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. మీ ప్రాంతంలో రోడ్లపై చెత్త కనిపించడం, గార్బేజి కలెక్షన్ సరిగ్గా జరగకపోవడం, గార్బేజి, డస్ట్ బిన్ల నుంచి చెత్త పొంగిపొర్లటం లాంటివి జరిగితే వెంటనే మీ మొబైల్లో ఫోటో తీసి లొకేషన్ వివరాలను పైన తెలిపిన నంబర్‌కు వాట్సప్ పంపండి.