HNK: భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామం కమ్యూనిటీ హాల్లో నేడు మహిళ శిశు సంక్షేమ శాఖ, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సఖి యొక్క ముఖ్య ఉద్దేశాలు, అందించిన సేవలను తెలియజేయుటకు లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి, సఖి సెంటర్ కేస్ వర్కర్ అనూష, శోభారాణి పాల్గొని సఖి సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశాలు వివరించారు.