SRCL: తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తికి ప్రతీక దొడ్డి కొమరయ్య అని సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టర్ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటంలో మొట్టమొదటి అమరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు.