WGL: ఖానాపూర్(M) దబిర్పేట గ్రామంలోని ZP సెకండరీ పాఠశాలలో ఈ నెల 14 జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ సురేష్ విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.