NGKL : అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో బుధవారం వేరుశనగ క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. మార్కెట్కు అత్యధికంగా 3,507 క్వింటాళ్ల వేరుశనగ రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.7,786, కనిష్ఠంగా రూ.5,011 ధర లభించింది. మోడల్ ధరగా రూ.6,869 పలికినట్లు అధికారులు తెలిపారు. అలాగే మినుములకు గరిష్ఠంగా రూ.8,219 ధర లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.