JGL: మెట్పల్లి మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పారిశుద్ధ్య వాహనాల జీపీఎస్ ట్రాకింగ్ పరికరాల రెన్యువల్, వనమహోత్సవ కార్యక్రమాలకు రూ.26 లక్షలు మంజూరు చేశారు. ఇంటింటికి మొక్కల పంపిణీకి రూ.16 లక్షలు, వార్డుల్లో డ్రైనేజీ, రోడ్ల మరమ్మతులకు రూ.8.90 లక్షలు, మోటార్ల మరమ్మతులకు రూ.4.55 లక్షలు కేటాయింపు చేశారు.